Virat Kohli: ఐసీసీ ర్యాంకింగ్స్... కోహ్లీ @ 5 1 y ago
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తిరిగి టాప్-5 లోకి వచ్చాడు. కోహ్లి ఒక స్థానం మెరుగై ఐదో స్థానంలో నిలిచాడు. శుభ్‌మన్ గిల్, బాబర్ అజామ్, రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. శ్రేయస్ అయ్యర్ 9వ ర్యాంకులోనే ఉండగా.. కేఎల్ రాహుల్ రెండు స్థానాలు మెరుగై 15వ ర్యాంకులో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ అగ్రస్థానంలో ఉండగా రషీద్ ఖాన్, కుర్దీప్ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. మహ్మద్ సిరాజ్ రెండు స్థానాలు దిగజారి 12వ ర్యాంకుకు పడిపోగా.. షమి ఒక స్థానం మెరుగై 14వ ర్యాంకులో నిలిచాడు.